Wednesday, May 1, 2024

ఏపీలో ఉద్యోగాల జాతర..?

ఏపీలో రానున్న కొన్ని నెలల్లో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సీఎం జగన్ ఇప్పటికే పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మిగిలి ఉన్న పోస్టులకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాదికి సంబంధించి భర్తీ చేయబోయే పోస్టుల వివరాలను ఆ క్యాలెండర్ లో పొందు పరచనున్నారు. ఇక ఈ క్యాలెండర్ ను ఉగాది రోజున విడుదల చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం మొదట భర్తీ చేయనున్న పోస్టులలో పోలీస్ శాఖకు సంబంధించిన ఆరువేల నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పలు శాఖల్లో మిగిలి ఉన్న పోస్టులు నోటిఫికేషన్ ల వివరాలను క్యాలెండర్ లో పొందు పరచనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement