Friday, May 3, 2024

TS | నీట్‌ యూజీ రాష్ట్ర అభ్యర్థుల జాబితా విడుల చేసిన కాళోజీ హెల్త్‌వర్సిటీ..

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: నీట్‌ యూజీ ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నీట్‌ వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం విడుదలచేసింది. నీట్‌ ర్యాంకుల వారీగా అభ్యర్థుల వివరాలను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ నుండి రాష్ట్రానికి అందింది. నీట్‌ పరీక్ష దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా చేసిన నమోదు ఆధారంగానే ఈ జాబితా ప్రకటిస్తున్నామన్నారు.

ఇది సమాచార నిమిత్తమేనని కాలోజీ వర్సిటీ పరిధిలోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు యూనివర్సిటీ మొదట రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు నోటిఫికేషన్‌ జారీచేస్తుందన్నారు. అభ్యర్థుల దరఖాస్తుల ఆధారంగా ధృవపత్రాలను పరిశీలించిన పిదపనే యూనివర్సిటీ మెరిట్‌ జాబితాను విడుదల చేయడం జరుగుతుందని యూనివర్సిటీ వర్గాలు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు వీలుగా అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసేందుకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

- Advertisement -

కాగా యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏడాది మే 7న జాతీయస్థాయిలో నీట్‌ అర్హత పరీక్షను నిర్వహించగా, జూన్‌ 13న జాతీయ స్థాయిలో ఫలితాలు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనరల్‌ కేటగిరిలో 137 మార్కులు, దివ్యాంగులకు 121, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరి విద్యార్థులకు 107 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించి ర్యాంకులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement