Monday, April 29, 2024

నాలుగేళ్ల ఐటీఈపీ ప్రోగ్రామ్‌కు ఎన్‌సీటీఈ దరఖాస్తులు ఆహ్వానం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) అకడమిక్‌ సెషన్‌ 2023-24 కోసం నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ (ఐటీఈపీ) కొరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బోధనను వృత్తిగా ఎంచుకునే విద్యార్థులందరికీ ఈ నాలుగేళ్ల ఐటీఈపీ కోర్సు అందుబాటులో రానుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని, ప్రస్తుతం బీఈడీ పూర్తి చేయాలంటే మొతం ఐదేళ్లు పట్టనుంది.

ఈ కోర్సు అందుబాటులోకి రావడం ద్వారా నాలుగేళ్లలో పూర్తి చేయనున్నారని పేర్కొంది. సెంట్రల్‌, స్టేట్‌ యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూషన్స్‌ ఈ నాలుగేళ్ల ఐటీఈపీ గుర్తింపు కోసం ఆన్‌లైన్లో దరఖాస్తును సమర్పించవచ్చని ఎన్‌సీటీఈ తెలిపింది. మే 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకునేందుకు గడువువిధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement