Monday, April 29, 2024

NBK 108: భగవంత్ కేసరి టీజ‌ర్.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది..

YouTube video

నేడు నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా భ‌గ‌వంత్ కేస‌రి చిత్రం నుండి టీజ‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్.
ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా టీజర్ ఉండటం విశేషం. ‘రాజు తన వెనక ఉన్న వందల మంది మందను చూపిస్తాడు మొండేడు తనకు ఉన్న గుండెను చూపిస్తాడు’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఇంట్రస్టింగ్ గా ఉంది. తొలిసారి బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడటం విశేషం.

విడుదల చేసిన కాసేపటికే టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. టైటిల్ పోస్టర్ లాగే టీజర్ విషయంలో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు మేకర్స్. టీజర్ ను ప్రపంచవ్యాప్తంగా 108 థియేటర్లలో ప్రదర్శిస్తారు. ఎందుకంటే ఇది బాలయ్య 108వ చిత్రం కాబట్టి. అంతేకాదు ఆయన 108వ సినిమా అనే విషయాన్ని టీజర్ లో కూడా స్పెషల్ గా చూపించారు. ఆయన చొక్కా పై 108 అనే అంకె కనపడటం విశేషం. భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది..అనే డైలాగ్ కూడా అద్భుతంగా ఉంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది.. ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ ట్రైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమా కాబట్టి ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కావడం పక్క అని నందమూరి ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందకు రానుంది.ఈ మూవీలో బాలయ్యకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా.

Advertisement

తాజా వార్తలు

Advertisement