Monday, May 6, 2024

National – 25 గ్యారెంటీలు – పాంచ్ న్యాయ్ పేరుతో కాంగ్రెస్ మేనిఫోస్టో


ఆమోదించిన కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ
అయిదు అంశాల‌పై ఫోక‌స్
హిస్సేదారి న్యాయ్,
కిసాన్ న్యాయ్
శ్రామిక్ న్యాయ్,
యువ న్యాయ్
నారీ న్యాయ్ వ‌ర్గాల‌కు హామీలు

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ త‌న మేనిఫేస్టోకు ఆమోద ముద్ర వేసింది.. మొత్తం అయిదు అంశాల‌తో ఈ మేనిఫెస్టోను రూపొందించారు.. ఇవాళ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయిన సీడబ్ల్యూసీ పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోపై చర్చించిన అనంతరం ఆమోదం తెలిపింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తర్వాత అధికారికంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. అన్ని వ‌ర్గాల ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్టో రెడీ చేయడంపై ఫోకస్ పెట్టింది. 5 ప్రధాన అంశాలతో పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోను రూపొందించారు. పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోలో హిస్సేదారి న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్ పేరిట కాంగ్రెస్ ఐదు ప్రధాన హామీలు ఇచ్చింది.

ఎన్నిక‌ల క‌మిటీ భేటీ

మరోవైపు ఇవాళ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సైతం భేటీ అయ్యింది. ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి.. క్యాండిడేట్ల పేర్లను కన్ఫామ్ చేసినట్లు సమాచారం. ఇవాళ లేదా రేపు అధికారికంగా అభ్యర్థుల లిస్ట్‌ను ఏఐసీసీ విడుదల చేయనున్నట్లు స‌మాచారం . కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల నేపథ్యంలో టికెట్ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక కాంగ్రెస్ తొలి జాబితాలో తెలంగాణలోని 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement