Sunday, April 28, 2024

రేపటి నుంచే ఓటీటీలో నాగార్జున కొత్త సినిమా

కింగ్ అక్కినేని నాగార్జున అక్కినేని, సైయామి ఖేర్, అలీ రెజా, అతుల్ కులకర్ణి తదితరులు నటించిన వైల్డ్ డాగ్ మూవీ ఈ గురువారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 2న విడుదలైన ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కినా బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితం లభించలేదు. నిజానికి ఓటీటీ రిలీజ్ కోసం భారీ డీల్ కుదుర్చుకున్న చిత్రబృందం చివరి నిమిషంలో థియేట్రికల్ రిలీజ్ వైపు మొగ్గు చూపడంతో చాలా నష్టం ఎదురైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 21 అర్థరాత్రి 12 గంటల నుంచి అందుబాటులో ఉండనుంది. అంటే రిలీజైన కేవలం 19 రోజుల్లోనే నెట్ ఫ్లిక్స్‌లో ప్రీమియర్ వేస్తుండడం ఒక సంచలనం అనే చెప్పాలి.

థియేటర్లలో విడుదలైన ఈ మూవీ 40-45 రోజులలో OTT లో అందుబాటులోకి వస్తుందని మేకర్స్ చెప్పారు. అంటే మే మధ్య నుండి నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కావచ్చని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇంత తొందరగా స్ట్రీమింగ్ కి సిద్ధం చేయడం ఆసక్తికర పరిణామం. హైదరాబాద్‌లో జరిగిన బాంబ్ బ్లాస్టులు, నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్. అహిషర్ సోలమన్ దర్శకత్వం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement