Tuesday, April 23, 2024

లేడీ రా ‘ఏజెంట్’ గా కాజల్

కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతున్నా సరైన హిట్ అందుకోలేకపోయాడు అక్కినేని అఖిల్. ఒక వైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తునే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇదిలా ఉండగా ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా లేడీ రా ఏజెంట్ గా రెడి అవుతుంది. అయితే అఖిల్ సినిమాలో కాదట.

కింగ్ అక్కినేని నాగార్జున చేస్తున్న సినిమాలో కాజల్ అగర్వాల్ రా ఏజెంట్ గా కనిపించనుందట. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ హీరో గా వస్తున్న సినిమాలో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ రా ఏజెంట్ పాత్రలో… దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడే యువతిగా కనిపోయించనుందట. ఇక ఇటీవల పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ సినిమాలను చేస్తూ మంచి జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement