Sunday, May 5, 2024

నాగ‌చైత‌న్య చిత్రంలో – వంట‌ల‌క్క‌

హీరో నాగ‌చైత‌న్య తాజా చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో సీరియ‌ల్ ఫేమ‌స్ న‌టి ప్రేమి విశ్వ‌నాథ్ కి ఛాన్స్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు.
ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రేమి విశ్వనాథ్ కి మంచి క్రేజ్ ఉంది. ఆమె కోసమే కార్తీక‌దీపం సీరియల్ ను ఫాలో అయ్యేవారు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. నాగచైతన్య హీరోగా రూపొందుతున్న వెంకట్ ప్రభు సినిమాలో ఆమె ఒక కీలకమైన పాత్రను పోషించనుంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగు మొదలైపోయింది. వెంకట్ ప్రభు తెలుగు – తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం ఎంచుకున్న మరికొంతమంది నటీనటుల పేర్లను ప్రకటిస్తూ వారి పోస్టర్లను వదిలారు. అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. సంపత్ రాజ్ .. ప్రేమ్ జీ అమరన్ .. వెన్నెల కిశోర్ .. ప్రియమణితో పాటు ప్రేమి విశ్వనాథ్ పోస్టర్ ను కూడా వదిలారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement