Friday, May 3, 2024

ఆక‌ట్టుకుంటోన్న విరాట‌ప‌ర్వం – న‌గాదారిలో సాంగ్

హీరో రానా..హీరోయిన్ సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న చిత్రం విరాట‌ప‌ర్వం.. ఈ నెల 17న సినిమా విడుదల కానుంది. వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.ఈ చిత్రం నుండి న‌గాదారిలో అనే లిరిక‌ల్ వీడియో ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.ఈ పాటను వరంగల్ కు చెందిన వరం ఆలపించగా, సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. లిరిక్స్ ను దేవేరి నరేందర్, భరద్వాజ్ కలిసి అందించారు. నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. పాటకు తగ్గట్లు మెలోడీ మ్యూజిక్ ఇచ్చారు సంగీత దర్శకులు. ‘నిప్పూ ఉంది..నీరూ ఉంది ‘నగాదారిలో’ అంటూ సాగే ఈ పాట వీడియోలో అడవిలో ఉన్న నక్సలైట్ కామ్రేడ్ రవన్నగా రానా, వెన్నెలగా సాయిపల్లవి నటించారు. పాటకు తగ్గట్లు సందర్భోచితంగా ముఖకవళికలతోనే భావాన్ని పలికిస్తోంది సాయిపల్లవి. రానా సైతం మ్యాన్లీగా కనిపిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement