Thursday, April 25, 2024

ముత్తు రికార్డులని ..ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ చేయనుందా

ఎన్నో రికార్డుల‌ను ట్రిపుల్ఆర్ మూవీ సాధించింది. కాగా ఈ చిత్రం శుక్రవారం జపాన్‌లో పెద్ద ఎత్తున రిలీజైంది. ఈ సినిమా కోసం ట్రిపుల్‌ఆర్‌ బృందం మూడు రోజులు ముందుగానే వచ్చి జోరుగా ప్రమోషన్స్ చేశారు. శుక్రవారం బుకింగ్స్ కూడా భారీ రేంజ్‌లో జరిగాయి. కాగా జపాన్‌లో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన టాప్-5 ఇండియన్‌ మూవీస్‌ లిస్ట్ తీస్తే అందులో మూడు సౌత్‌ చిత్రాలు ఉండటం విశేషం. ‘ముత్తు’, ‘బాహుబలి-2’, ‘దర్బార్‌’ వంటి సినిమాలు టాప్‌-5లో మొదటి మూడు ప్లేస్‌లలో ఉన్నాయి. ఆ తర్వాత ‘3-ఇడియట్స్’, ‘ఇంగ్లీష్‌-వింగ్లీష్‌’ సినిమాలున్నాయి. అయితే 1995లో వచ్చిన ‘ముత్తు’ సినిమా జపాన్‌లో ఇప్పటికీ హైయెస్ట్‌ కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాగా ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. జపాన్‌లో ఈ సినిమా రూ.26.2 కోట్ల వరకు కలెక్షన్‌లు సాధించింది. ఇప్పటివరకు ఈ రికార్డు బ్రేక్‌ కాలేదంటే విశేషం అనే చెప్పాలి. కాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జపాన్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి చాలా మంది ఆ రికార్డు బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు. మరి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ముత్తు’ రికార్డును బ్రేక్‌ చేస్తుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement