Thursday, May 2, 2024

Munugode by poll results : 7,8 రౌండ్ల‌లోనూ టీఆర్‌ఎస్ దే హ‌వా.. 3091 ఓట్ల లీడ్‌..

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు అన్ని రౌండ్ల‌లో టీఆర్ఎస్ స్వ‌ల్ప ఆధిక్యంతో ముందుకు సాగుతుంది. ఎనిమిదో రౌండ్ ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ పూర్త‌య్యింది. ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి 3091 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నది. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 6624 ఓట్లు పోలవగా, బీజేపీకి 6088 ఓట్లు వచ్చాయి. దీంతో ఎనిమిదో రౌండ్‌లో కారు గుర్తుకు 536 ఓట్లు అధికంగా వచ్చాయి. ప్రస్తుతం తొమ్మిదో రౌండ్‌ ఓట్ల లెక్కింపు కొనసాగతున్నది.

అయితే ఏడు రౌండ్లు పూర్తయ్యేస‌రికి టీఆర్ఎస్‌ పార్టీకి 45,723 ఓట్లు పోలవగా, బీజేపీకి 43,155, కాంగ్రెస్‌ పార్టీకి 13,689 ఓట్లు వచ్చాయి. కాగా, టీఆర్‌ఎస్ 2568 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఏడో రౌండ్‌లో కారు గుర్తుకు 7202 ఓట్లు, బీజేపీకి 6803, కాగ్రెస్‌కు 1664 చొప్పున ఓట్లు పోలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement