Saturday, May 18, 2024

WPL | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా నేడు యూపీ వారియర్స్ – ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఇప్ప‌టివ‌ర‌కు 3 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు యూపీ వారియర్స్ 3 ఓటములు, 2 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఓడిన యూపీ వారియర్స్ మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తుండగా, బెంగళూరులో యూపీతో జరిగిన ఓటమికి ముంబై ఇండియన్స్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

ముంబై ఇండియన్స్:

యాస్తికా భాటియా (Wk), హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (c), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, సజీవన్ సజన, హుమైరా కాజీ, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్.

- Advertisement -

UP వారియర్స్ :

అలిస్సా హీలీ (c), చమరి అథాపత్తు, కిరణ్ నవ్‌గిరే, గ్రేస్ హారిస్, శ్వేతా సెహ్రావత్, పూనమ్ ఖేమ్నార్, దీప్తి శర్మ, సైమా ఠాకోర్, సోఫీ ఎక్లెస్టోన్, రాజేశ్వరి గయక్వాడ్, ఉమా చెత్రీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement