Monday, April 29, 2024

తిల‌క్ వ‌ర్మ ఇంటిలో ముంబై ఇండియ‌న్స్ స‌భ్యుల సంద‌డి..

హైద‌రాబాద్ – నేడు సన్ రైజర్స్ టీమ్ తో జరిగే మ్యాచ్ కోసం హైదరాబాద్ కు వచ్చిన ముంబై ఇండియన్స్ టీమ్ ఆ జ‌ట్టు స‌భ్యుడు, హైద‌రాబాదీ తిలక్ వర్మ ఇంట్లో గ‌త రాత్రి సందడి చేసింది. క్రికెట్ గాడ్ సచిన్, రోహిత్ శర్మ, పియుష్ చావ్లా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అర్జున్ టెండూల్కర్ సహా ముంబై ఆటగాళ్లు తిలక్ వర్మ ఇంటికి వెళ్లారు. అతని ఇంట్లో డిన్నర్ కూడా చేశారు. తర్వాత తిలక్ కుటుంబసభ్యులతో కలిసి ముంబై ఆటగాళ్లు ఫోటోలు దిగారు. .
ముంబై టీమ్ స్టార్లు తన ఇంటికి రావడంపై తిలక్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘నా ‘ఎంఐ పల్టన్‌’ ఫ్యామిలీకి మా ఇంట్లో డిన్నర్‌ పార్టీ ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ అద్భుతమైన రోజును నేను, నా కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. మా ఇంటికి వచ్చిన ఎంఐకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement