Friday, April 26, 2024

టాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా 14 ఏళ్ల బాలుడు

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంఎస్ రాజు బ్రాండ్ అనేది అందరికీ తెలిసిందే. సుమంత్ ఆర్ట్స్ బ్యానరుపై ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత ప్రొడక్షన్‌కు విరామం ఇచ్చిన రాజు.. దర్శకుడిగా అవతారం ఎత్తారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన చిత్రం ‘డర్టీ హరి’. యూత్‌ను అట్రాక్ట్ చేసిన ఈ చిత్రంతో తనను తాను నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆయన నుంచి మరో చిత్రం రాబోతోంది. ఆ సినిమా పేరు ‘7 డేస్.. 6 నైట్స్’. ఈ చిత్రంతో ఓ 14 ఏళ్ల బాలుడిని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎం.ఎస్.రాజు పరిచయం చేయబోతున్నారు.

అతడి పేరు సమర్థ్ గొల్లపుడి. ఇప్పటికే అతడు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు తన మ్యూజిక్‌ను పరిచయం చేసి అందరిచేత ప్రశంసలు పొందుతున్నాడు. అతని సంగీతానికి ఫ్యాన్స్ కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి సమర్థ్‌ను ఎం.ఎస్.రాజు ఏకంగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌ను చేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సమర్థ్ గొల్లపుడిని వరుసగా మూడు చిత్రాలకు సైన్ అప్ చేయించారట. అంటే అతడిలో విషయం ఎంత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ సినిమాను వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ బ్యానరుపై ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement