Friday, March 29, 2024

మహేష్ తో త్రివిక్రమ్ మళ్ళీ అదే లెక్క !!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఖలేజ, అతడు వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండూ కూడా థియేటర్స్ లో అంతగా ప్రభావం చూపించకపోయినప్పటికీ… ఆ తర్వాత టీవీలో మాత్రం మంచి రేటింగ్ తో దూసుకుపోతూ ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుండటంతో సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. గత సినిమాలు క్లాసిక్ జాబితాలో చేరగా ఇప్పుడు ఈ సినిమా కూడా క్లాసిక్ జాబితాలోనే చేరనుందట. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే త్రివిక్రమ్ చాలా బాగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా అంచనాలను ఏ మేర అందుకుంటుందో లేదో చూడాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement