Thursday, April 25, 2024

Viral | బ‌ర్త్‌డే నాడు ధోనీ ఏం చేశాడంటే.. వైర‌ల్ అవుతున్న వీడియో

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిన్న (శుక్రవారం-జులై 7) 42వ పుట్టిన రోజు జ‌రుపుకున్నాడు. దేశంలో కోట్లాది మంది అభిమానుల‌ను, ఆరాధించేవారిని సొంతం చేసుకున్నాడు. అయితే.. ఈ స్టైలిష్ అండ్ మిస్ట‌ర్ కూల్‌ క్రికెట‌ర్‌ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. కానీ, తన పుట్టినరోజు నాడు అభిమానులలో త‌న‌పై చూపిన ప్రేమ.. ఉత్సాహాన్ని చూసి, ఇవ్వాల సోషల్ మీడియాలో ఒక‌ ప్రత్యేకమైన వీడియోను షేర్ చేశాడు.

‘‘మీ అందరి హృదయపూర్వక శుభాకాంక్షలకు చాలా కృతజ్ఞతలు, నా పుట్టినరోజున నేను ఏమి చేశానో ఒక దానికి సంబంధించిన చిన్న గ్లింప్స్’’ అంటూ.. MS తన 42వ పుట్టినరోజును తన పెంపుడు జంతువులతో కలిసి జరుపుకుంటున్న వీడియోను షేర్ చేశాడు. ఇప్పుడ‌ది పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement