Thursday, May 16, 2024

Delhi | అన్నదాతల కోసం 5 వేల కోట్వివ్వండి.. ప్యాకేజీ విడుదలకు కేంద్రానికి ఎంపీ శ్రీకృష్ణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతుల కోసం సహాయ ప్యాకేజీ విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన తుపాన్‌తో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, గుంటూరు, పల్నాడు ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిని, దాదాపు 7 వేల కోట్లకు పైగా నష్టం వచ్చిందని, నిధులు కేటాయించి ఆంధ్ర రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని శ్రీకృష్ణ కోరారు. 5 వేల కోట్లను సహాయ ప్యాకేజీగా విడుదల చేయాలని, పార్లమెంట్‌లో రూల్ 377 కింద కేంద్రాన్ని ఎంపీ అభ్యర్థించారు. వరి, మిరప, పసుపు, పొగాకు వంటి పంటలపై తీవ్ర ప్రభావం పడిందని, నీట మునిగి పూర్తిగా పంట నాశనం అయ్యిందన్నారు.

2 లక్షల కోట్లతో బీఎస్ఎన్‌ఎల్ 5జీ సర్వీసులు

దేశంలో 2 లక్షల కోట్లతో బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెస్తున్న శ్రీ కృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్ సిన్హా చౌహాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023 నాటికి దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్‌వర్క్‌లు అమలు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

నీటి కొరతను తీర్చడానికి కేంద్ర పథకాలు

నీటి కొరతను తీర్చడానికి పీఎంకేఎస్‌వై, జలజీవన్ మిషన్, అటల్ భూ జల్ యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నామని కేంద్ర జల శక్తి సహాయ శాఖ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు. మహారాష్ట్ర, హర్యానా సహా 11 ప్రధాన రాష్ట్రాల్లో తీవ్ర నీటి ఎద్దడిపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చర్యలపై ఎంపీ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement