Tuesday, April 16, 2024

RK Effect.. 11 నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించిన వైసిపి

మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన నేప‌ధ్యంలో వైసిపి అధినేత జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.. నేడు ఏకంగా 11 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పాత వారి స్థానంలో కొత్త వారిని నియమించారు.

ఇన్‌ఛార్జ్‌ల మార్పునకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ కీలక నేత, మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో ఇవాళ మీడియాకు వెల్లడించారు. ప్రత్తిపాడుకు బాలసాని కిషోర్, తాటికొండకు సుచరిత, సంతనూతలపాడుకు మేరుగ నాగార్జున, కొండెపికి ఆదిమూలపు సురేష్, వేమూరు స్థానానికి అశోక్ బాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మంత్రి విడదల రజినీ, అద్దంకి పాణెం హనిమిరెడ్డి, మంగళగిరికి గంజి చిరంజీవి, చిలకలూరిపేటకు రాజేష్ నాయుడు, గాజువాక స్థానానికి రామచందర్ రావు, రేపల్లేకు గణేష్‌లను నియమించినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement