Sunday, April 28, 2024

వాహనదారులు తస్మాత్‌ జాగ్రత్తా… అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్‌ రూల్స్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ట్రాఫిక్‌ నియమాలను పూర్తి స్థాయిలో అమలుచేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు సిద్దమయ్యారు. ఇన్నాళ్లుచూసిచూడనట్లు వ్యవహరించిన పోలీసులు ఇక పై కఠినంగా వ్యవహరించనున్నారు. అందులో భాగంగా నియమాలు ఉల్లింగిస్తే జరిమాన విధించక త ప్పదని హెచ్చరికలు చేశారు.సోమవారం నుండి కొత్తనియమాలు అమల్లో ఉంటాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేశారు. ప్రధానంగా ట్రాఫిక్‌ సజావుగా సాగేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ఈనియమాలను అమలుచేస్తున్నారు. వాహనచోదకులకు ఎటువంటి ఆటంకంలేకుండా చూసేందుకు కొత్త నియమాలు అమల్లోఉంటాయని ట్రాఫిక్‌ యంత్రాంగం వివరించారు.ఇక నుండి ట్రాఫిక్‌ కూడళ్ళవద్ద ఎరుపురంగు సిగ్నల్‌ వచ్చిన తరువాత గీత దాటితే వందరూపాయల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఫ్రీ లెప్ట్‌ విధానంను ట్రాఫిక్‌ పోలీసులు గతంలోనే అందుబాటులోకి తీసుకువచ్చారు, కానీపూర్తి స్థాయిలోవాహదారులకు వినియోగంలోకి రాలేదన్నిట్రాఫిక్‌ యంత్రాంగం గుర్తించింది. దీనితో ఇకపై ఫ్రీలెప్ట్‌ వ్యవస్థను వాహనదారులకు పూర్తి స్థాయిలోవినియోగించుకునేలా చర్యలుచేప ట్టారు.ఒకవేల ఫ్రీలెప్ట్‌ కుఅంతరాయం కలిగిస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని స్పష్టంచేశారు.

హైదరాబాద్‌ మహానగరంలో రోజు రోజుకు వాహనాల వినియోగం పెరుగుతోంది. దీనితో సంఖ్యపెరుగుతోంది. 30లక్షల పై చిలుకు వాహనాలు రోడ్లమీదకు వస్తున్నాయని పోలీసులు తెలిపారు.ట్రాఫిక్‌ ని నియంత్రించాలంటే తప్పనిసరిగా కొన్ని మార్పుులు చేయాల్సిందే ని పోలీసులు రాష్ట్రప్రభుత్వానికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని కొత్త చట్టాలను కూడా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు .అందులో భాగంగానే ఆపరేషన్‌ రోపే పేరుతో చర్యలు చేపట్టారు. దీనితో ఇటు వాహనదారులకు అటు ట్రాఫిక్‌ పోలీసులుకు లాభంచేరుకుందని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.రోడ్డును ఆక్రమించినా కఠినంగా వ్యవహరించనున్నారు. వంద రూపాయలు నుండి వెయ్యి రూపాయల వరకు జరిమాన తోపాటు వాటిని తొలగించడం తరలించేందుకు కూడా డబ్బులు ముక్కుపిండి వసూల్‌ చేస్తామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.లైన్‌ దాటితే యాక్ట్‌ 1988,మోటార్‌ వాహన చట్టం177 ప్రకారం100రూపాయలు జరిమాన, ఫ్రీలెఫ్ట్‌ కు అంతరాయం కలిగిస్తే మోటర్‌ వాహనచట్టం119 యాక్ట్‌ 1988,వెయ్యి రూపాయలు జరిమాన తప్పదని స్పష్టం చేశారు.

గతంలోరోడ్డు ప్రమాధాలు నివారించేందుకు పోలీసులు ద్విచక్ర వాహదారులు తప్పకుండా తలకు హెల్మట్‌ దరించాలని,చాలుగు చక్రాల వాహన చోదకులు సీట్‌ బెల్ట్‌ తప్పనిసరి చేశారు. ఆ నియమాలు మొదట కాస్త ఇబ్బందిగా మారిగా ఆతర్వాత హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ యొక్క ప్రాముఖ్యత పై వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు.ఆ తర్వాత వాహన చోదకుల్లో అవగాహన పెరిగింది. ప్రతి ఒక్కరు హె ల్మెట్‌ వినియోగిస్తున్నారు.సీట్‌ బెల్ట ్‌ వాడుకుంటున్నారు..తాజాగా హైదరాబాద్‌ మహానగరంలో ట్రాఫిక్‌ పోలీస్‌ లు కొత్త నియామలు అమలుతో ట్రాఫిక్‌ సమస్యలు చాలామట్టుకు తీరుతాయని ఆశిస్తున్నారు.అంతేకాకుండా కొత్త నియమాల పై వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమం కు త్వరలో శ్రీకారం చుట్టుతారా లేక నేరు గా నియమాలు,నిబంధనలు అంటు వాహనచోదకుల పై నెట్టుతాాం వేచిచూడాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement