వాజేడు (ప్రభ న్యూస్): కుటుంబ కలహాలతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలో జరిగింఇ. వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వాజేడు ఎస్సై హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. పెనుగోలు కాలనీకి చెందిన స్వప్న (13) కాటారం గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చింది. ఇంట్లో తగాదాలతో మనస్తాపం చెందింది.
దీంతో ఆత్మహత్యా యత్నం చేయగా.. బంధువులు వాజేడు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో స్వప్న చనిపోయిందని మృతురాలి తండ్రి ముత్తయ్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
- Advertisement -
