Monday, April 29, 2024

తెలంగాణ బీజేపీ నేనే కాపాడా: మోత్కుపల్లి కీలక వ్యాఖ్య

సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ మోత్కుపల్లి నరసింహులు హాజరు కావడంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుమతితోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘దళిత్ ఎంపవర్ మెంట్’ సమావేశానికి వెళ్లినట్లు స్పష్టం చేశారు. కొందరు నేతలు బండి సంజయ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సీఎం ఏర్పాటు చేసిన దళిత సమావేశానికి  వెళ్లి తెలంగాణ బీజేపీని కాపాడనని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. సీఎం సమావేశానికి వెళ్లకపోతే బీజేపీకి అపవాదు వచ్చేదని అభిప్రాయపడ్డారు. దళిత వ్యతిరేక పార్టీగా బీజేపీపై ఉన్న ముద్రను పోగొట్టేప్రయత్నం చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానిస్తే వెళ్లకుండా ఎలా ఉంటానని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్య పైన ఎక్కువ సేపు మాట్లాడారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం సుదీర్ఘ సమావేశం జరిగిందన్నారు. వ్యాపారాల కోసం పార్టీ మారే వ్యక్తులతో నీతులు చెప్పించుకునే స్థితిలో లేనని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌కు తాను దగ్గరవ్వలేదని, స్వలాభం కోసం పార్టీలు మారనని స్పష్టం చేశారు. తాను బీజేపీలోనే ఉంటానని మోత్కుపల్లి తేల్చి చెప్పారు. కాగా, మోత్కుపల్లి వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమైయ్యాయి.

కాగా, నిన్న ప్రగతిభవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించగా, ఆ ఆదేశాలు పట్టించుకోకుండా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరవడమే కాకుండా సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: మాట వినని మాజీ మంత్రి.. మోత్కుపల్లిపై బీజేపీ సీరియస్‌!

Advertisement

తాజా వార్తలు

Advertisement