Saturday, April 27, 2024

హైటెక్నాల‌జీతో సూప‌ర్ స్టార్ కృష్ణ మోసగాళ్లకు మోసగాడు ట్రైల‌ర్ – వీడియోతో…

YouTube video

సూప‌ర్ స్టార్ దివంగ‌త కృష్ణ తన కెరియర్ తొలినాళ్లలో మోసగాళ్లకు మోసగాడు సినిమాతో తెలుగు తెరకి కౌబోయ్ కథలను పరిచయం చేశారు. అప్పట్లో ఈ సినిమాలోని కృష్ణ లుక్ . గుర్రపు స్వారీలు భారీ చేజింగులు చూసి ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యారు. కృష్ణ ఈ సినిమాను తన సొంత బ్యానర్లో నిర్మించారు. కే ఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కృష్ణ సరసన నాయికగా విజయనిర్మల నటించారు. 1971లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. అలాంటి ఈ సినిమాను కృష్ణ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 31వ తేదీ రీ రిలీజ్ చేస్తున్నారు. 4K రిజల్యూషన్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ ను కృష్ణ త‌న‌యుడు సూప‌ర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశాడు.. లెటెస్ట్ టెక్నాల‌జీతో రూపొందించిన ఈ ట్రైల‌ర్ నేటి ప్రేక్ష‌కుల‌ను ఆల‌రించేది ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement