Tuesday, April 30, 2024

ఇప్పటివరకు 3 కోట్లకుపైగా ఐటీఆర్‌లు

న్యూఢిల్లీ : ఆర్థిక సంవత్సరం 2020-21కి సంబంధించి ఇప్పటివరకు 3 కోట్లకుపైగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలయ్యాయని ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఐటీఆర్‌లు దాఖలు చేయనివారు వీలైనంత త్వరగా దాఖలు చేయాలని పన్ను చెల్లింపుదార్లకు సూచించింది. రోజుకు 4 లక్షల చొప్పున ఐటీఆర్‌లు వస్తున్నాయి. గడువు సమీపిస్తుండడంతో దాఖలు పెరుగుతున్నాయని తెలిపింది.

ఐటీఆర్‌ దాఖలు గడువు డిసెంబర్‌ 31న ముగిసిపోనుందని, గడువు సమీపిస్తున్నందున పన్నుచెల్లింపుదార్లు త్వరపడాలని ఆర్థిక శాఖ మరోసారి గుర్తుచేసింది. ఈ-మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌, మీడియా ప్రచారాల ద్వారా చెల్లింపుదార్లను ప్రోత్సహిస్తున్నామని గుర్తుచేసింది. చివరి నిమిషంలో కంగారుపడడం కంటే ముందు జాగ్రత్తపడడం మంచిదని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement