Saturday, April 27, 2024

జులై 19 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి మొదలు కానున్నాయి. మొత్తం 19 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు.. ఆగస్టు 13తో ముగియనున్నాయి. ఈ మేరకు  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. రాజ్యసభ, లోక్‌సభల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సమావేశాలను నిర్వహిస్తామన్నారు. ఎంపీలందరూ ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. కోవిడ్ టీకా తీసుకోని వారు వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement