Sunday, April 28, 2024

బ్రహ్మాకుమారీస్‌.. ఇపుడు లేకున్న మరెపుడు లేదు (ఆడియోతో..)

మనిషి స్వభావం ఇవాళ చేసేదాన్ని రేపటికి వాయిదా వేయటం పైగా ఫలానా ”పరిస్థితి దాటుకొంటే ప్రయత్నం చేస్తాను” అని ఆలోచించుట పొరబాటు. మనం నిరంతరం మన ఎదురుగా ”ఇపుడు లేకపోతే ఎప్పుడూ లేదు” అనే నినాదం ఉంచుకొనాలి. ”మనం రేపటి నుండి యోగం చేద్దాము” అనుకోకుండా ఇప్పటి నుండే ఈశ్వరీయ స్మృతిలో ఉందాము అనే ఆలోచన చేయాలి. పరిస్థితులను స్వస్థతతో సరి చేసికొనాలి. అంతేగాని పరిస్థితులు బాగయితే స్వస్థితి అభ్యాసం చేస్తామని ఆలోచించరాదు. వ్యవహారసిద్ధి అయితే మేము పరమార్ధంలో మునిగిపోతాము అని ఆలోచించకుండా మేము పరమార్థంలో నిమగ్నమయితే వ్యవహారంలో కూడా తప్పకుండా ఈశ్వరుని సహాయం లభిస్తుందని ఆలోచించాలి.

ఈ విధంగా జ్ఞాన మధనం గావిస్తూ పురుషార్ధంలో నిమగ్నం కావాలి. ఇపుడు ఎంత సమయం వ్యాపార వ్యవహారాలకిస్తున్నారో దానికంటే ఎక్కువ సమయం ఈశ్వరీయ స్మృతి మరియు ఈశ్వరీయ సేవకు ఇమ్మని శివబాబా అంటున్నారు. ఒకవేళ అలా చేయలేకపోయినా కనీసం దానికి వినియోగించినంత సమయమైన ఇవ్వండి. లేకపోతే ఎంత సమయం వ్యాపారాలు, వ్యవహారాలు అంటూ దానిలోనే ఉంటే వెనుక పడిపోతారు తరువాత పశ్చాత్తాపము చెందవలసి వస్తుంది.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement