Saturday, April 27, 2024

మొగుళ్లపల్లి మండలం ఘోరం.. కన్నతండ్రిని కడతేర్చిన కసాయి కొడుకు

మొగుళ్ళపల్లి, ప్రభన్యూస్‌: కన్న తండ్రిని ఒంటిపై పెట్రోల్‌ పోసి తగలబెట్టిన అమానుష సంఘటన మొగుళ్లపల్లి మండలం నర్సింగాపూర్‌ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఏడున్నర సమయంలో చోటు చేసుకుంది గ్రామస్తుల కథనం ప్రకారం మండలంలోని వేములపల్లి గ్రామ శివారు నరసింగాపూర్‌ గ్రామపంచాయతీలో మెరుగు మహేందర్‌ అలియాస్‌ రఘు (45) అనే వ్యక్తికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రఘు వృత్తిరీత్యా ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తూ ఉంటాడు అతనికి మద్యం సేవించడం కొంతకాలం నుండి ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో తరచుగా మద్యం విషయంలో గొడవలు జరుగుతూ వస్తూ ఉండేది గత రెండు రోజుల క్రితం పెద్ద కుమారుడు యుగంధర్‌ అక్రమంగా ట్రాక్టర్‌ ద్వారా ఇసుక తరలిస్తున్న విషయంలో మొగుళ్ళపల్లి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

దీంతో రెండవ కుమారుడు మెరుగు నరేందర్‌ (19) తండ్రి రఘు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడని కోపంతో గత మూడు రోజుల నుండి తండ్రితో గొడవ పడుతూ వస్తూ ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంగ్లీ కిషన్‌ అనే బెల్ట్‌ షాపు కిరాణం నిర్వహిస్తున్న వ్యక్తి ఇంట్లో మృతుడు రఘు ఉండగా అక్కడికి వచ్చి అక్కడే ఉన్న కిరాణా షాపులోని పెట్రోల్‌ తీసుకొని రెండవ కొడుకు మెరుగు నరేందర్‌ తండ్రి రఘు పై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.. స్థానికులు గమనించి కాలిపోతున్న రఘు పై నీళ్లు పోసి ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంకొక వ్యక్తి తనకు చుట్టుకున్న లుంగీని విప్పి రఘు పై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా ఆర్పే ప్రయత్నం చేసిన వ్యక్తికి కూడా మంటలు అంటుకొని చిన్నపాటి గాయాలు అయినట్లు తెలిసింది.

55 శాతం రఘు శరీరం కాలిపోవడంతో గ్రామస్తులు అంబులెన్స్‌ కు సమాచారం ఇచ్చారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. సమాచారం అందుకున్న మొగుళ్ళపల్లి ఎస్సై శ్రీధర్‌ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రత్యక్ష సాక్షిలతో వాంగ్మూలాన్ని స్వీకరించారు.. మృతుడు ఇంటిని సైతం పరిశీలించి కాలిన బట్టలను స్వాధీనం చేసుకొని చిట్యాల సిఐ పులి వెంకట్ కు సమాచారం అందించగా చిట్యాల సిఐ సైతం ఆదివారం గ్రామంలో విచారణ చేపట్టారు. కిరాణా షాపు యజమాని కిషన్‌ అతని భార్య శోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మొగుళ్ళపల్లి ఎస్సై శ్రీధర్‌ చిట్యాల సిఐ పులి వెంకట్‌ గౌడ్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement