Sunday, April 28, 2024

Modi’s Gift – బైడ‌న్ కు యుజుర్వేద గ్రంధం …ఫ‌స్ట్ లేడీకి గ్రీన్ డైమండ్

వాషింగ్ట‌న్ – ప్రధాని మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నేడు అమెరికా అధ్యక్ష భవనానికి వెళ్లారు. ఈ సందర్భంగా బైడెన్ దంపతులకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు అందజేశారు. అధ్యక్షుడు జో బైడెన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన ఓ ప్రత్యేక బాక్సును అందించగా.. ప్రథమ మహిళ జిల్‌కు మాత్రం ప్రత్యేకమైన గ్రీన్ డైమండ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. బైడ‌న్ కు ఇచ్చిన బాక్స్ లో ప్రాచీన భారతీయ గ్రంథమైన కృష్ణ యజుర్వేదంలో పేర్కొన్న ‘దృష్ట సహస్రచంద్రో’ అని రాసిన పత్రాన్ని అందులో ఉంచారు. అనంత‌రం మోడీ అమెరికా అధ్య‌క్షుడితో కొత్త సేపు ముచ్చ‌టించారు.. వారు ఇచ్చిన అతిథ్యాన్ని స్వీక‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement