Tuesday, April 30, 2024

మోదీ కొత్త కేబినెట్: కేంద్ర మంత్రులు- వారి శాఖలు

ఎన్డీయే-2 హయాంలో తొలిసారిగా చేపట్టిన కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది మంత్రులు రాష్ట్రపతి భవన్‌లో బుధవారం ప్రమాణాలు చేశారు. వీరిలో 15 మందికి కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులు. దీంతో కేంద్రంలో మొత్తం మంత్రుల సంఖ్య 78కి పెరిగింది. వీరిలో 31 మంది కేబినెట్ హోదా మంత్రులు కాగా, మిగిలినవారు సహాయ మంత్రులు. కేంద్ర హోం, విదేశాంగ శాఖలకు ముగ్గురేసి సహాయ మంత్రులను కేటాయించారు. మోదీ కొత్త కేబినెట్‌లో మంత్రులకు శాఖలను కేటాయిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన చేసింది.

★ అమిత్ షా: హోం, సహకార
★ రాజ్‌నాథ్ సింగ్: రక్షణ
★ నితిన్ గడ్కరీ: రహదారులు, రవాణ
★ నిర్మలా సీతారామన్: ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
★ నరేంద్ర సింగ్ తోమర్: వ్యవసాయ, రైతు సంక్షేమ
★ జయశంకర్: విదేశీ వ్యవహారాలు
★ అర్జున్ ముండా: గిరిజన వ్యవహారాలు
★ స్మృతి ఇరానీ: మహిళా, శిశు సంక్షేమ
★ పీయూష్ గోయల్: పరిశ్రమలు, ప్రజా పంపిణీ, టెక్స్‌టైల్
★ ధర్మేంద్ర ప్రదాన్: విద్య
★ ప్రహ్లాద్ జోషి: పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులు
★ నారాయణ్ రాణే: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
★ సార్బానంద సోనోవాల్: పోర్ట్స్, షిప్పింగ్, జల రవాణా, ఆయుష్
★ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ: మైనార్టీ వ్యవహారాలు
★ వీరేంద్ర కుమార్: సామాజిక న్యాయం, సాధికారిత
★ గిరిరాజ్ సింగ్: గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్
★ కిషన్ రెడ్డి: పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
★ జ్యోతిరాదిత్య సింధియా – పౌరవిమానయాన శాఖ
★ రామచంద్ర ప్రసాద్ సింగ్ – ఉక్కు మంత్రిత్వ శాఖ
★ అశ్విని వైష్ణవ్ – రైల్వే శాఖ, కమ్యూనికేషన్స్ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖలు
★ పశుపతి కుమార్ పారస్ – ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ
★ గజేంద్ర సింగ్ షెకావత్ – జలశక్తి మంత్రిత్వశాఖ
★ కిరణ్ రిజిజు – న్యాయశాఖ
★ రాజ్ కుమార్ సింగ్ – పవర్ మినిస్ట్రీ, న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ
★ హర్‌దీప్ పూరీ – పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ, గృహనిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ
★ మంసుఖ్ మాండవీయ – ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు మరియు ఎరువుల శాఖ
★ భూపేంద్ర యాదవ్ – పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ, లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మినిస్ట్రీ
★ మహేంద్ర నాథ్ పాండే – భారీ పరిశ్రమల శాఖ
★ పర్షోత్తమ్ రూపాలా – ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ మరియు డెయిరీ శాఖ
★ అనురాగ్ సింగ్ ఠాకూర్ – సమాచారం మరియు బ్రాడ్‌కాస్టింగ్ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖలు

Advertisement

తాజా వార్తలు

Advertisement