Thursday, May 9, 2024

బాలలపై 100 శాతం సమర్థతతో పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సిన్!

కరోనా ఉదృతి పెరుగుతున్న క్రమంలో చిన్నారులపై వ్యాక్సిన్ ప్రయోగాలు వేగంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా 12 నుంచి 17 ఏళ్ల బాలలపై చేసిన ప్రయోగాల్లో మోడేర్నా టీకా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లుగా తేలింది. దీంతో వచ్చే జూన్ నెలలో సంస్థలకు దరఖాస్తులు చేస్తామని మోడెర్నా తెలిపింది. ఇప్పటికే అమెరికాలో 12 నుంచి 15 ఏళ్లు పైబడిని వారికి వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఫైజర్ అనుమతి పొందిన విషయం తెలిసిందే.వ్యాక్సిన్ ప్రయోగాల్లో భాగంగా మోడెర్నా 12 నుంచి 17 ఏళ్ల వయస్సున్న 3,732 మంది బాలలపై ప్రయోగించింది. కొవిడ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన ఫార్మా కంపెనీల్లో మోడెర్నా కూడా ఒకటి. తాము రూపొందించిన వ్యాక్సిన్ బాలలపైనా సమర్థవంతంగా పనిచేస్తోందని మోడెర్నా చెబుతోంది. 12 నుంచి 17 ఏళ్ల బాలలపై తమ కొవిడ్ టీకాను ప్రయోగించి చూడగా, 100 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయని మోడెర్నా వివరించింది. ఈ క్రమంలో జూన్ ఆరంభంలో ఎఫ్ డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతులు కోరేందుకు సన్నద్ధమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement