Thursday, May 2, 2024

‘డిస్ట్రిబ్యూట్ లవ్’@ నిధి అగర్వాల్

కరోనా కష్టకాలంలో ఎంతో మంది సినీ ప్రముఖులు సామాన్య ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ తన వంతు సహాయం చేయడానికి ముందడగు వేసింది. కష్టంలో ఉన్న వారి కోసం డిస్ట్రిబ్యూట్ లవ్ అని చారిటబుల్ ఆర్గనైజేషన్ ను స్టార్ట్ చేసింది.

దీంతో కష్ట కాలం లో ఇబ్బందులు పడుతున్న వారికి సహకారం అందించనుంది. ఇక నిధి అగర్వాల్ తీసుకున్న ఈ నిర్ణయానికి నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది నిధి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. అలాగే మరికొన్ని చిత్రాల్లో కూడా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement