Monday, April 29, 2024

ప‌ల్లె దవాఖానాల్లో ఆధునిక వైద్యసేవ‌లు..

ఇప్పటి వరకు పల్లెల్లో అందుతున్న సర్కారీ వైద్యంలో పల్లె దవాఖానాలు విప్లవాత్మక మైన మార్పు తేనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 4830 పల్లె దవాఖానాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఐదు వేల జనాభా ఉన్న ప్రతి ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ను పల్లె దవాఖానాగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో హెల్త్‌ వర్కర్‌, ఆశాలు, ఏఎన్‌ఎంల ద్వారానే వైద్య సేవలు అందుతున్నాయి. ఇక మీదట పల్లె దవాఖానాలుగా రూపుదిద్దుకోనున్న పీహెచ్‌సీ ల్లో ఎంబీబీఎస్‌ వైద్యుల సేవలు 24 గంటలూ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు పట్టణాల్లోని ప్రయివేటు ఆస్పత్రు ల్లో అందే వైద్య సేవలు పేద ప్రజలకు ఇక పల్లెల్లోనే ఉచితంగా అందనున్నాయి.

ప్రతి పల్లె దవాఖానాలో 17 మంది వైద్య సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. వీరిలో ఒక మెడికల్‌ ఆఫీసర్‌ (ఎంబీ బీఎస్‌) పూర్తి సమయం, మరో మెడికల్‌ ఆఫీసర్‌ పార్ట్‌ టైమ్‌, ఇద్దరు ఫార్మాసిస్టులు, ఏఎన్‌ఎంలు, హెల్త్‌ వర్కర్లు ఐదుగురు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, హెల్త్‌ మేనేజర్‌ ఒక్కరేసి చొప్పున, అకౌం టెంట్‌తో కలిపి ముగ్గురు సహాయకులు విధుల్లో ఉంటారు. పల్లె దవాఖానాల్లో గర్భిణులు, నవజాత శిశువులకు పక్కా వైద్యం, చిన్నారులు, యువతకు అన్ని రకాల వైద్య సేవలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఇతర సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద సంక్రమిత వ్యాధుల కట్టడి (విష జ్వరాలు, వైరస్‌ల నియంత్రణ తదితర) ఇన్‌పేషెంట్‌, ఔట్‌ పేషెంట్‌ సేవలతో కలిపి అందనున్నాయి. అసంక్రమిత వ్యాధులైన బీపీ, షుగర్‌, కిడ్నీ తదితర వైద్య సేవలు, టీబీ, కుష్టు వ్యాధికీ చికిత్స ఇక పల్లెల్లోనే అందనుంది. గొంతు, చెవి, ముక్కు సమస్యలకు కూడా పల్లె దవాఖానాలే చికి త్స చేయనున్నాయి. 24 గంటలపాటు అత్యవసర వైద్య సేవలు అందుతాయి. మానిసక వ్యాధులకు కూడా పల్లె దవాఖానాల్లో చికిత్స అందించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement