Monday, April 29, 2024

ఒమిక్రాన్ ఎఫెక్ట్‌.. పిల్లలతో నిండిపోతున్న న్యూయార్క్ హాస్పిట‌ళ్లు..

అమెరికాలో ఒమిక్రాన్ కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ ను అధిగమించి ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. గత వారం సెంట‌ర్ ఫ‌ర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ (CDC) తెలిపిన‌ వివరాల ప్రకారం.. డెల్టా కేసులు 27శాతానికి పడిపోగా.. ఒమిక్రాన్ కేసులు మాత్రం 73 శాతానికి పెరిగాయి. వారం రోజుల వ్యవధిలో ఒమిక్రాన్ కేసులు సగటున రోజుకు 1.90 ల‌క్ష‌లుగా న‌మోద‌వుతున్నాయి. మరోవైపు న్యూయార్క్ హాస్పిట‌ళ్ల‌లో చేరుతున్న చిన్నారుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. కొవిడ్ సంబంధిత కేసులతో హాస్పిట‌ళ్ల‌న్నీ ఫుల్ అవుతున్నాయి.

న్యూయార్క్ హాస్పిట‌ళ్ల‌లో చేరుతున్న వారికి బెడ్స్ కూడా దొర‌క‌ని ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఈ నెల 5న ప్రారంభమై ఇప్ప‌టి వ‌ర‌కు హాస్పిట‌ళ్ల‌లో చేరిన 18ఏళ్ల లోపు వారి సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగింద‌ని అధికారులు చెబుతున్నారు. వీరిలో దాదాపు సగం మంది 5 సంవత్సరాలలోపు పిల్ల‌లే ఉండ‌డం గమనార్హం. ఐదేళ్ల లోపు వారు టీకా తీసుకునేందుకు అర్హులు కాదని న్యూయార్క్ స్టేట్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement