Friday, June 9, 2023

హ‌త్య కేసులో ఎమ్మెల్సీ అనంత‌బాబు- ఈ నెల 9న విచార‌ణ‌

ఎమ్మెల్సీ అనంతబాబు త‌న వ‌ద్ద డ్రైవ‌ర్ గా ప‌ని చేసిన సుబ్ర‌హ్మ‌ణ్యంను హ‌త్య చేసిన కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. కాగా త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టులో ఇప్ప‌టికే బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేసుకున్నారు. ఈ కేసులో అనంత‌బాబు రిమాండ్ ముగుస్తున్న నేప‌థ్యంలో సోమ‌వారం పోలీసులు ఆయ‌న‌ను రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా… ఈ నెల 20 వ‌ర‌కు ఆయ‌న రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అనంత‌బాబు దాఖ‌లు చేసుకున్న బెయిల్ పిటిష‌న్ మంగ‌ళ‌వారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టులోనే విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌మూర్తి త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 9(గురువారం)కి వాయిదా వేశారు. గురువారం నాటి విచార‌ణ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి బెయిల్ పిటిష‌న్‌పై అనంత‌బాబు వాద‌న‌ల‌తో పాటు పోలీసుల త‌రఫు వాద‌న‌ల‌ను వినే అవ‌కాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement