Monday, April 29, 2024

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్ డేట్ లాక్.. బాక్సాఫీస్ వ‌ద్ద ఆ సినిమాతో పోటీ

చాలా కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం మిస్ శెట్టి మిసెస్ పోలిశెట్టి మూవీ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. మూవీ మేక‌ర్స్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కొత్త విడుదల తేదీని ప్ర‌క‌టిస్తూ ఓ కొత్త వీడియో & పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేశారు. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి మహేష్ బాబు దర్శకత్వం వ‌హించారు.

కాగా, UV క్రియేషన్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ 4న విడుదల కావాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడింది. ఇక సెప్టెంబర్ 7 న రిలీజ్ కానున్న‌ట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి రధన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

అయితే అదే రోజున అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా., షారుఖ్ ఖాన్ న‌టించిన‌ జ‌వాన్ మూవీ కూడా రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద జవాన్ సినిమాతో ఢీకొనేందుకు ఈ పాన్-ఇండియన్ సినిమా సిద్ధమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement