Saturday, May 4, 2024

మంత్రి కేటీఆర్ ట్వీట్ : ఛాలెంజ్‌ను స్వీకరించిన పవన్‌ కళ్యాణ్

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల మధ్య చేనేత ఛాలెంజ్ నడుస్తోంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సందర్భంలో చేనేత ఉత్పత్తుల ప్రమోషన్ కోసం ఆయన #MyHandloomMyPride పేరుతో ఛాలెంజ్ విసిరారు. చేనేతలతో దిగిన ఫొటోలను.. ట్వీట్ చేయాలని కోరారు. ఈ ఛాలెంజ్‌ను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పారిశ్రామిక వేత్త ఆనంద మహేంద్ర, క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు విసిరారు. కేటీఆర్ చేనేత ఛాలెంజ్‌ను పవన్ కళ్యాణ్ స్వీకరించారు. చేనేతల మీద తనకున్న ప్రేమాభిమానాలను చాటుకుంటూ వారితో దిగిన ఫొటోలను పవన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అనంతరం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి బాలినేని, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌కు చేనేత ఛాలెంజ్ విసిరారు పవన్ కళ్యాణ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement