తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రి ఎర్రబెల్లికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
- Advertisement -