Sunday, May 5, 2024

కొవిడ్‌తో మానసిక వైకల్యం.. రెండేండ్ల‌ తర్వాత బయటపడని వైనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొవిడ్‌ వ్యాధి సోకిన తర్వాత మానసిక వైకల్యం సంభవిస్తుందా ? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రత్యేకించి పిల్లల్లో ఈ ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొత్తం 1.25 మిలియన్‌ రికార్డులను అధ్యయనం చేసిన తర్వాత శాస్త్రవేత్తలు పోస్టుకొవిడ్‌ మానసిక వైకల్యాన్ని ధృవీకరించారు. కోవిడ్‌ మహమ్మరి తాకిడి మొదలైన తర్వాత… ఈ వ్యాధికి గురై, చికిత్స తీసుకుని కోలుకున్న వారిపై ఈ పరిశోధనలు జరిగాయని పరిశోధనా బృందం చెబుతోంది. ఇందుకు సంబంధించి సుదీర్ఘంగా పరిశోధనలను నిర్వహించింది. కాగా… కొవిడ్‌ సోకడానికి ముందు… మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో… కొవిడ్‌ చికిత్స తర్వాత… సంబంధిత వ్యాధుల తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు. అమెరికాకు చెందిన ట్రినెక్స్‌ సంస్థ నెట్‌వర్క్స్ లో ఉన్న రికార్డుల ప్రాతిపదికన ఈ వివరాలు వెల్లడయ్యాయి. వివిధ దేశాల్లో మొత్తం కోవిడ్‌ సోకి, చికిత్సతో బయటపడిన 2.47 లక్షల మందిపై ఈ పరిశోధనలు జరిగాయి.

న్యూరోలాజికల్‌ సికియాట్రిక్‌ డయాగ్నసిస్‌ సంబంధిత పరిశోధనలు… ఒమిక్రాన్‌ వేరియంట్‌ బాధితులపైనే ఈ పరిశోధనలు అధికంగా జరిగాయి. ఇక కోవిడ్‌ మరో వేరియంట్‌… సార్స్‌ సోకిన పెద్ద వయస్సు వారిలో… డిప్రెషన్‌, యాంగ్జెటీ సంబంధిత సమస్యలు వెలుగచూసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక అరవై సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో… కోవిడ్‌ బారినపడి కోలుకున్న తర్వాత… కండరాల సమస్యలతో బాధపడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బారిన పడి కోలుకున్న వారిలో… తాజా పరిశోధనల ఫలితాలు ఒకింత ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే… భారత్‌లో కోవిడ్‌ బారిన పడి కోలుకున్నన వారి సంఖ్య అరకోటి పైమాటే. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు పదిహేను లక్షల మంది వరకు కోవిడ్‌ వ్యాధి సోకి, ఆ తర్వాత చికిత్సలతో బయటపడినట్లు వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement