Friday, May 17, 2024

FIH Hockey WC | రేప‌టినుంచే పురుషుల హాకీ ప్రపంచ కప్ !

పురుషుల హాకీ 5 ప్రపంచకప్ రేపటి (ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. జనవరి 28 నుంచి 31 వరకు ఒమన్‌లోని మస్కట్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఈ ప్రపంచ కప్‌లో మొత్తం 16 జట్లు ఆడనుండగా.. వాటిని 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశ ముగిసే సమయానికి ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జనవరి 30న జరగే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. అదే రోజు నాకౌట్ రౌండ్‌లో సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.. ఇక్కడ గెలిచిన జట్లు జనవరి 31న
(బుధవారం) జరిగే ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి.

కాగా, పురుషుల FIH హాకీ 5s ప్రపంచ కప్‌లో భారత జట్టు ఈజిప్ట్, జమైకా, స్విట్జర్లాండ్‌లతో పాటు గ్రూప్ బీలో ఉంది. ఇక గ్రూప్ ఏ లో నెదర్లాండ్స్, నైజీరియా, పాకిస్థాన్, పోలాండ్ జ‌ట్లు త‌ల‌డ‌నున్నాయి. గ్రూప్ సిలో ఆస్ట్రేలియా, కెన్యా, న్యూజిలాండ్, ట్రినిడాడ్ & టొబాగో ఉండగా.. ఫిజీ, మలేషియా, ఆతిథ్య జట్టు ఒమన్, యునైటెడ్ స్టేట్స్ పూల్ D లో పోటీపడనున్నాయి.

భారత పురుషుల హాకీ జట్టు

- Advertisement -

సూరజ్ కర్కేరా, పవన్ రాజ్‌భర్, మంజీత్, మన్‌దీప్ మోర్, ఉత్తమ్ సింగ్, మణిందర్ సింగ్, సిమ్రంజీత్ సింగ్, మహమ్మద్ రహీల్, గుర్జోత్ సింగ్ మరియు ప్రశాంత్ చౌహాన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement