Monday, April 29, 2024

అలర్ట్: జ్ఞాపకశక్తి తగ్గిందా? అయితే అది కరోనా లక్షణమే

కరోనా వైరస్‌ సోకితే.. దగ్గు, జలుబు, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయి. అయితే జ్ఞాపకశక్తి తగ్గినా అది కరోనా లక్షణమేనట. కరోనా సోకినవారిలో మెదడు, నరాలపైనా ప్రభావం పడుతోందని ప్రముఖ న్యూరో సర్జన్‌ రంగనాథమ్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ ప్రభావం మెదడుపై పడటంతో జ్ఞాపక శక్తి తగ్గుతుందన్నారు. ఉదయం లేవగానే ఏ పనీ చేయలేకపోవడం, ఏదీ గుర్తుండక పోవడం, చికాకుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. నిద్ర లేకపోవడంతో పాటు మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని తెలిపారు. కంటిచూపు కూడా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ లక్షణాలను ముందుగానే గుర్తించి కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, అందరూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు. చాలా మందికి తమకు వైరస్‌ వచ్చింది అన్న సంగతి తెలియడం లేదన్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే ఉంటాయని భావిస్తున్నారు. కానీ అంతకంటే ముందుగానే కొంత మందిలో నరాలపైనా ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెదడు సరిగా పనిచేయదని చెబుతున్నారు. వైరస్‌ ఉన్న వ్యక్తికి క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గుతుందని ఏ పనీ చేయలేరని అంటున్నారు. చికాకుగా అనిపిస్తుంది.. 50 ఏళ్లు దాటిన పేషెంట్‌ జ్ఞాపక శక్తి తగ్గిందంటూ ఆస్పత్రికి రాగా పరీక్షలు నిర్వహించారు. అందులో అతడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement