Wednesday, May 1, 2024

జ‌వాన్ నుండి మెలోడీ సాంగ్.. ఫుల్ వ‌ర్ష‌న్ రిలీజ్ అప్పుడే!

పఠాన్ మూవీ భారీ విజయం త‌రువాత‌.. బాలీవుడ్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో న‌టిస్తోన్న అప్ క‌మింగ్ మూవీ జవాన్. ఈ సినిమాతో మ‌రోసారి త‌న అభిమానుల‌ని, ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు షారుఖ్. కాగా, ఇటీవలే ఈ మూవీ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను రిలీజ్ చేశారు మేక‌ర‌స్స్. అంతే కాకుండా సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ కూడా అభిమానుల్లో మంచి అంచ‌నాలను క్రియేట్ చేశాయి.

కాగా, ఇవ్వాల (శ‌నివారం) మూవీ నుండి మ‌రో సాంగ్ ప్రీవ్యూ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. చలెయా అని సాగే ఈ మెలోడీ ఫుల్ సాంగ్ ని మూడు (తెలుగు, హిందీ, త‌మిళ్) భాష‌ల్లో సోమ‌వారం రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌కటించారు మేక‌ర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement