Saturday, May 4, 2024

రాఖీ క‌ట్టించుకోవ‌డ‌మే కాదు-ర‌క్ష‌ణ‌గా నిల‌వాల్సింది మ‌న‌మే-చిరంజీవి ట్వీట్

రాఖీ పౌర్ణమి సంద‌ర్భంగా సోద‌రిమ‌ణులంద‌రికి శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. రాఖీ కట్టించుకోవటమే కాదు.. రక్షగా నిలుస్తామని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకి మాటివ్వాలి అని ట్వీట్ చేశారు చిరంజీవి. ఈ సందర్భంగా మరోవైపు చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్ర బృందం రాఖీ పండుగ కానునను చిరు అభిమానులకు అందించింది. ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తున్న హీరోయిన్ కీర్తి సురేశ్ ఆయనకు బొట్టు పెట్టి రాఖీ కడుతున్న వీడియోను విడుదల చేసింది. ప్రతి తెలుగు ఇంటి ఆరాధ్యుడు. వెన్నంటి ఉండే అందరివాడు. మన భోళా శంకరుడు. మెగాస్టార్ చిరంజీవి నుంచి రక్షా బంధన్ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేసింది. ‘భోళా శంకర్’ సినిమాకు మెహెర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement