Thursday, April 25, 2024

మెకానిక్ విజ‌యం సాధించాలి…

మణి సాయి తేజ -టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మెకా నిక్‌’ మోషన్‌ పోస్టర్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు విడుదల చేశారు. మెకానిక్‌ చిత్రం మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసిన దిల్‌ రాజుకు దర్శక నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు.
మున్నా (ఎమ్‌.నాగ మునె) నిర్మాతగా, కొండ్రాసి ఉపేందర్‌ – నందిపాటి శ్రీధర్‌ రెడ్డి సహ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ‘మెకానిక్‌’. ”ట్రబుల్‌ షూటర్‌” అన్నది ట్యాగ్‌ లైన్‌. ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కమర్షియల్‌ అంశాల,తో గ్రామీణ ప్రాంతంలో జరిగే ఒక బర్నింగ్‌ ప్రాబ్లం నేపథ్యంలో… వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కుతోంది.

మణి సాయి తేజ సరసన రేఖ నిరోషా హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటూ విడుదలకు సిద్ధమవుతోంది.
తనికెళ్ల భరణి, నాగ మహేష్‌, సూర్య, ఛత్రపతి శేఖర్‌, సంధ్యా జనక్‌, సునీత మనోహర్‌, సమ్మెట గాంధీ, వీరశంకర్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సంగీతం: వినోద్‌ యాజమాన్య, ఛాయాగ్రహణం: ఎస్‌.వి.శివరాం, ఎడిటర్‌: శివ శర్వాణి, సాహిత్యం: ముని సహేకర – ఎమ్‌.ఎన్‌.సింహ, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాష్‌,

Advertisement

తాజా వార్తలు

Advertisement