Thursday, May 2, 2024

ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలకు పెద్దపీట వేసిన సియం జగన్ – రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు

తాడేపల్లి,ఫిబ్రవరి23(ప్రభ న్యూస్) రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచిఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ
ల అభ్యున్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు అన్నారు.
బుధవారం తాడేపల్లి బై పాస్ రోడ్డు లోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం
నిర్వహించారు. ఈ సందర్బంగా కనకరావు మాట్లాడుతూ సామాజిక న్యాయానికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని అన్నారు. 18 ఎమ్మెల్సీ స్థానాల్లో… బీసీలకు 11, ఎస్సీలకు 2 స్థానాలు కేటాయించారని .ఎస్టీలకు 1, ఓసీలకు 4 స్థానాలు కేటాయించారని . స్థానిక సంస్థల కోటాలోని 9 స్థానాలకు గాను…. 6 బీసీలకు, 1 ఎస్సీ, 2 ఓసీలకు కేటాయించారని ఎమ్మెల్యే కోటాలోని 6 స్థానాలకు గాను… 4 బీసీలకు, 1 ఎస్సీ, 2 ఓసీలకు ఇచ్చారని. గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలకు గాను… 1 బీసీ, 1 ఎస్టీ అభ్యర్థులకి తెలిపారు.


సామాజిక న్యాయం ఆచరణలో సియం జగన్ కొత్త చరిత్ర సృష్టించారని అన్నారు. సీఎం జగన్ తోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తలెత్తుకు తిరిగేలా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.
మహాత్మ జ్యోతిరావ్ పూలె, అంబేద్కర్ వారసుడు సీఎం జగన్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ తాడేపల్లి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు ముదిగొండ ప్రకాష్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement