Sunday, April 28, 2024

మట్టి కుస్తీ ఫస్ట్ లుక్ రిలీజ్.. నిర్మాణంలో భాగమైన హీరో రవితేజ

తమిళంలో గట్ట కుస్తీ టైటిల్ తో తెరకెక్కుతోన్న మూవీని తెలుగులో మట్టి కుస్తీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.ఈ చిత్రంలో హీరోగా విష్ణు విశాలు నటిస్తున్నాడు. ఈ సినిమాలో విష్ణు విశాల్ జోడీగా ఐశ్వర్య లక్ష్మి కనిపించనుంది. తమిళంలో ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్. ఇటీవల ఓటీటీలో వచ్చిన ‘అమ్ము’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్ కి మరింత చేరువైంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, చెల్ల అయ్యవు దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఈ సినిమా తమిళ .. తెలుగు భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ సినిమాలోని విష్ణు విశాల్ ఫస్టులుక్ ను కొంతసేపటి క్రితం రవితేజ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. కుస్తీ పోటీలో భాగంగా బరిలోకి దిగుతూ ఈ పోస్టర్ లో విష్ణు విశాల్ కనిపిస్తున్నాడు. విష్ణు విశాల్ తో రవితేజకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ సినిమాకి విష్ణు విశాల్ తో పాటు రవితేజ కూడా నిర్మాత కావడం మరో విశేషం. అందువలన రవితేజ ఈ ఫస్టులుక్ ను వదిలాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement