Tuesday, May 21, 2024

కలిసొచ్చిన ‘మాస్క్ మస్ట్’

కరోనా సెకండ్ వేవ్ తో దేశం, రాష్ట్రంలో ప్రతి రంగం మళ్లీ సంక్షోభం ముంగిట నిలుచుంటే సిరిసిల్ల చేనేత వస్త్రకారులు మాత్రం దీనిని ఒక అవకాశంగా మలుచుకుంటున్నారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలన్న ప్రభుత్వ నిబంధనతో మాస్కు లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇదే అదునుగా సిరిసిల్లలోని పలువురు మహిళలు మాస్కులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. కరోనా మహ మ్మారి తిరిగి సెకండ్ లో విజృంభించ
డంతో రాష్ట్రంలో కొవిడ్ నిబంధనల అమలు, ఆంక్షలు మళ్లీ ప్రారంభమయ్యాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం మాస్కును తప్పనిసరి చేసింది.మాస్కు ధరించని వారికి పోలీసులు జరిమానాలు విధి స్తున్నారు. ఈ క్రమంలో మాస్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల మహిళల మాస్కుల తయారీలో వేగం పెంచి అంది వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల వినియోగించుకుంటున్నారు. వస్త్ర ఉత్పత్తికి మారుపేరైన రాజన్న
సిరిసిల్ల పట్టణంలో పలువురు బీడీలు చుట్టే మహిళలు, పనులు లేక ఖాళీగా
ఉంటున్న మహిళలు మాస్కుల తయారీలో నిమగ్నమయ్యారు. కాటతో
తయారు చేసిన మాస్కులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో స్థానిక
వస్త్ర ఉత్పత్తిదారులు, గార్మెంట్ పరిశ్రమ యజమానులతో కలిసి మాస్కులు జోరుగా తయారుచేస్తున్నారు.

మాస్కులకు మహారాష్ట్ర, తమిళనాడులతో పాటు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల హోల్ సేల్ వ్యాపారుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కార్పొరేట్ సంసలైతే ప్రత్యేకంగా వారి కంపెనీ ముద్రతో మాస్కులు తయారు చేయించుకుంటున్నారు. మాస్కులు ఉచితంగా పంపిణీ చేసే పలు స్వచ్ఛంధ సంస్థల వారు కూడా వీరి వద్ద మాస్కులు తయారు చేయించుకుం
టున్నారు. ఈ తరహాలో పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తుండడంతో ఒక్కో మహిళ రోజుకు 100 నుంచి 200 మాస్కులు కుడుతూ ఉపాధి పొందుతున్నారు. కష్టకాలంలో ఈ మాస్కుల తయారీకుటుంబపోషణకుఉపయోగపడుతోందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో రోజుకు 2 లక్షల దాకా మాస్కులు తయారవుతున్నట్లుఅంచనాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement