Saturday, April 27, 2024

మారుతి న‌గ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం.. అప్ డేట్ ఇచ్చిన మేక‌ర్స్

హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు రావు ర‌మేశ్‌..ఇప్ప‌టి వ‌ర‌కు విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో అలరించారు.ఆయ‌న ప్రధాన పాత్రలో నటిస్తున్న మారుతి నగర్‌ సుబ్రహ్మణ్యం అప్‌డేట్‌ వీడియో రూపంలో వచ్చేసింది. లక్ష్మణ్‌ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అలనాటి అందాల తార ఇంద్రజ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తున్నారు. పీబీఆర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ బ్యానర్‌లో వస్తున్న రెండో చిత్రమిది. మారుతి నగర్‌లో ఫన్‌ మొదలైంది.

ఉగాది పచ్చడి, బెండకాయవేపుడుతోపాటు వినోదాత్మకంగా సాగే మారుతి సుబ్రహ్మణ్యం పాత్రతో ఈ ఉగాదిని జరుపుకోండి అంటూ ఓ వీడియోను మేకర్స్ షేర్ చేశారు. గళ్ల చొక్కా, లుంగీ గెటప్‌లో ఉన్న రావు రమేశ్‌ క్యారవాన్‌లో నుంచి షూటింగ్‌ లొకేషన్‌లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్టర్‌ యాక్షన్‌ అనగానే.. బెండకాయ వేపుడు లేదా డైలాగ్‌ చెప్తూ.. నవ్వు ఆపుకోలేకపోతున్నా డైరెక్టర్‌ అంటున్నాడు రావు రమేశ్‌.మొత్తానికి చిన్న వీడియోతో సినిమా ఎలా ఉండబోతుందో చెబుతూ.. క్యూరియాసిటీని పెంచుతున్నాడు డైరెక్టర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement