Saturday, June 3, 2023

ఎడిటోరియ‌ల్ – ఉరికి ఉరి ఎప్పుడు….

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైవి చంద్రచూడ్‌ ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం చెప్పమంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.ఉరిశిక్ష చాలా క్రూరమైనదనీ,మెడకు ఉరి వేసి చంపడం కన్నా నొప్పి లేకుండా ఇతర పద్దతుల్లో ప్రాణాలు తీసే వీలుందా అని ప్రశ్నించారు.నాగరిక సమాజంలో ఉరిశిక్షను వ్యతిరేకిస్తున్న వారెందరో ఉన్నారు.ఉరి శిక్షను అరుదైన కేసుల్లో అరుదై నదిగా న్యాయమూర్తులు అభివర్ణి స్తుంటారు. క్షమయీ ధ రిత్రి అని మన భరత మాతను కీర్తిస్తుంటారు. అంటే మన వారిలో జాలి గుణం ఎక్కువ. అయ్యో పాపం అనే భావన కారణంగా ఎదుటివారు ఎంత క్రూరమైన నేరానికి పాల్పడినా, వాడి పాపానికి వాడు పోతాడులే అని సరిపెట్టుకునే గుణం ఉంది. ముఖ్యంగా, ఆడపిల్లల్లో సహనం ఎక్కువ.వారిని పొగిడేట ప్పుడు క్షమయీ ధరిత్రి అని తరచూ వినియోగిస్తుంటారు. భూమాతకు ఎం త సహనం ఉందో, ఆడవారిలో కూడా అంత సహనం ఉందని చెప్పడమే ఈ సూక్తి అర్థం.అయితే, ఆడవారి సహనాన్ని అలుసుగా తీసుకుని వారి పట్ల పెళుసుగా ప్రవర్తిస్తున్న మానవ మృగాలను అదుపు చేయాలంటే ఉరిశిక్ష విధించడమే సరైన శిక్ష అన్న డిమాండ్లు తరచూ వినిపిస్తుం టాయి. ఆ శిక్షను అమలు జరపడం అంత సులభం కాదు.

- Advertisement -
   

శిక్షకు గురైన వారు సుప్రీంకోర్టు వరకూ వెళ్ళి న్యాయపోరాటం చేస్తుంటారు.అందువల్ల అవి ఖరారు కావడానికి దశాబ్దం పైగా పడుతూ ఉంటుంది. 100 పైగా దేశాల్లో ఉరిశిక్షను రద్దు చేశారు.మన దేశంలో ఈ శిక్ష రద్దు కోసం వివిధ వర్గాల నుంచి అభ్యర్ధనలు వస్తున్నాయి.అవమానాలు పాలైన ఆడపిల్లలూ, పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఉరి వేసుకుంటున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. .చైనాలో అవినీతి పరులను, సౌదీ అరేబియా వంటి దేశాల్లో కట్టు తప్పిన వారిని రెప్పపాటు వ్యవధిలో ఉరితీసేస్తుంటారు. విదేశాల్లో నొప్పి లేకుండా మరణ దండనలను అమలు జరిపే పద్దతులున్నాయి. ఇంజెక్షన్‌ ద్వారా నూ, గ్యాస్‌ చాంబర్స్‌లో ముద్దా యిలను ఉంచి శిక్షలు అలు జరుపుతున్నట్టు తరచూ వార్తలు వస్తుంటాయి. మన దేశంలో తాడుతో ఉరితీసే పాత పద్దతులే అమలులో ఉన్నాయి.దానికి కూడా సుదీర్ఘమైన ప్రక్రియ ఉంది. ఉరిశిక్ష పడిన వారిని కండెమ్‌డ్‌ సెల్‌లో ఉంచుతారు.ఏకాంతంలో ఉంచితే వారిలో ఏమాత్రమైనా మార్పు వస్తుందేమోనన్న భావనతో చేసే వారు.అలాంటి వారి కోసం ఎక్కడో అండమాన్‌ జైలులో ఉంచేవారు. బ్రిటిష్‌ వారి కాలంలో స్వాతంత్య్ర యోధుల కోసం అండమాన్‌ జైలులో ప్రత్యేకమైన సెల్‌లు నిర్మించారు.అలా నెలల తరబడి ఉంచి ఉరితీసేవారు. స్వాతంత్య్రానంతరం ఉరి శిక్షలు అమలు జరిగిన సంఘటనలు చాలా తక్కువ.

ఇందుకు మన రాజ్యాంగం కల్పించిన వెసులుబాట్లు ఎన్నో ఉన్నాయి. చట్టాన్ని తప్పించుకోవడం మన దేశంలో చాలా సులభం. చట్టాన్ని వక్రీకకరించకుండా, చట్టపరిధిలో కేసుల విచారణ జరిపే న్యాయమూర్తుల్లో మానవీయత గల న్యాయమూర్తులు ఉరిశిక్షవం టి క్రూరమైన శిక్షలను విధించేందుకు వెనుకాడు తుంటారు.అలాంటి వారిలో సామాజిక స్పృహ అదనపు లక్షణంగా వారిని ముందుకు సాగనీయదు.ఇతర దేశాల్లో మాదిిరిగా నొప్పిలేకుండా ప్రాణాలు తీసి శిక్ష అమలు జరిపే పద్దతులేమైనా ఉన్నాయేమో చెప్పమని చీఫ్‌ జస్టిస్‌ కోరుతున్నారు.ఇందుకు నిపుణుల కమిటీ వేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు.ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చంద్రచూడ్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సామాజిక న్యాయం కోణం నుంచి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.సామాజిక సమస్యలపై స్పందిస్తున్నారు.ఆ మధ్య సహజీవనం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన తన అభిప్రాయాన్ని నిష్కర్షగా స్పష్టం చేశారు.సహజీవనం చేసే వారు తమ పేర్లను నమోదు చేసే పద్దతిని కేంద్రం ప్రవేశపెట్టాలని కోరుతూ ఒక న్యాయవాదిని ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిల్‌)ని దాఖలు చేసినప్పుడు,ఇది తెలివి తక్కువ ఆలోచనగా కొట్టివేశారు.


కోర్టులకు చిన్నా,పెద్దా తేడా లేదనీ, అన్ని కేసులూ ఒకటె నని వ్యాఖ్యా నించారు.కోవిడ్‌ సమయంలో సర్వోన్నత న్యాయస్థానం మూడు లక్షలకు పైగా కేసులపై విచారణ జరిపి పరిష్కరించిందని చెప్పారు. శిక్షలనేవి ముద్దా యిల్లో పరివర్తన తేవాలే కానీ, వారిపై కక్ష సాధించినట్టు వాటిని అమలు తేయడం ప్రధానం కాదని అన్నారు. పూర్వపు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ మాదిరిగా ఆయన కూడా సామాజికాంశాలను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వాల్లో కదలిక లేక పోయినా, న్యాయస్థానాల్లో ఈ మాదిరి ఆలోచనల వల్ల ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement