Friday, March 15, 2024

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. కొద్దిగా పుంజుకున్న అదానీ షేర్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నాడు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచే లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం తరువాత మరింతగా బలపడ్డాయి. అదానీ గ్రూప్‌కు సంబంధించి కొన్ని సానుకూల అంశాలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపాయి. అదానీ గ్రూప్‌ కంపెనీలు కొన్ని రుణాలను ముందస్తుగా చెల్లించాలని నిర్ణయించినట్లు వచ్చిన వార్తలు, సకాలంలో బాండ్ల చెల్లింపులు చేయనున్నారని వచ్చిన వార్తులతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఈపరిణామాలతో ఒక దశలో 30 శాతం వరకు నష్టపోయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు భారీగా కోలుకుని చివరకు 2 శాతం నష్టంతో ముగిసింది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ కంపెనీ షేరు మాత్రం 6.51 శాతం లాభపడింది. మిగిలిన అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు నష్టపోయాయి.
సెన్సెక్స్‌ 30 సూచీలో 3 షేర్లు మాత్రమే నష్టపోయాయి.

లాభపడిన షేర్లు..

టైటాన్‌ కంపెనీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఎం అండ్‌ ఎం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎల్‌ అండ్‌టీ, మారుతీ సుజుకీ, ఐసీఐసీ బ్యాంక్‌, టీసీఎస్‌, ఐటీసీ, నెస్లే ఇండియా, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అదానీ పోర్ట్స్‌, ఓఎన్‌జీసీ, ఆపోలో ఆస్పటల్స్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..

- Advertisement -

ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హీరో మోటోకార్ప్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, సిప్లా, పీసీఎల్‌, దివిస్‌ ల్యాబ్స్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement