Friday, April 26, 2024

మార్కెట్లో కొత్త రికార్డులు..

దేశీయ స్టాక్ మార్కెట్లు విజృంభిస్తున్నాయి. ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు అల్ టైం రికార్డును క్రియేట్ చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త ఆల్‌టైమ్ రికార్డులు ఆటో, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లు 1 శాతం చొప్పున పెరగడం తో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులు సృష్టించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు గ్రీన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 253 పాయింట్లు పెరిగి ఆల్‌టైమ్ హై 58,115.69కి చేరింది. నిఫ్టీ 50 ఇండెక్స్ రికార్డు స్థాయి 17,311.95ను తాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్ర బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, టైటాన్, యాక్సిస్ బ్యాంకు, లార్సెన్ అండ్ టూబ్రో సెన్సెక్స్‌లో టాప్ మూవర్స్‌గా నిలిచాయి. 30 షేర్ సెన్సెక్స్ 58 వేల మార్క్‌ను దాటడం సరికొత్త ఆల్‌టైమ్ రికార్డు. శుక్రవారం తొలిసారి ఈ రికార్డు నమోదైంది. నిఫ్టీ 50 ఇండెక్స్ తన ముఖ్యమైన సైకలాజికల్ లెవెల్ 17,300ను తొలిసారి దాటింది. శుక్రవారం ఉదయం 9.26 గంటలకు సెన్సెక్స్ 208 పాయింట్లు ఎగబాకి, 58,060కి చేరింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 56 పాయింట్లు ఎగబాకి 17,290కి చేరింది. ఆసియన్ షేర్స్ శుక్రవారం లాభాల్లో కనిపించాయి. డాలర్ ప్రధాన కరెన్సీతో పోల్చినపుడు ఓ నెలలో అతి తక్కువ స్థాయిలో కనిపించింది.

ఇది కూడా చదవండి: ఫ్లైఓవర్ పై ఆర్టీసీ బస్సు బీభత్సం.. డివైడర్ ను ఢీ కొట్టి..

Advertisement

తాజా వార్తలు

Advertisement