Thursday, May 16, 2024

ఆర్మీకి ఐపీఎంవీ, టీఏఎస్‌ఎల్‌ ఆధ్వర్యంలో తయారీ.. ఆర్మీ స్టాఫ్‌ చీఫ్‌కు అందజేత

టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఏఎస్‌ఎల్‌) మొదటి లాట్‌ ఇన్‌ఫాంట్రీ ప్రొటెక్టెడ్‌ మొబిలిటీ వెహికిల్స్‌ (ఐపీఎంవీ)ని ఆర్మీ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణే, పీవీఎస్‌ఎం, ఏవీఎస్‌ఎం, ఎస్‌ఎం, వీఎస్‌ఎం, ఏడీసీకి అందజేసింది. పూణ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత సాయుధ బలగాల కోసం చక్రాలతో కూడిన పోరాటానికి సిద్ధంగా ఉన్న వాహనాలు తయారు చేసి అందజేసిన మొదటి ప్రైవేట్‌ రంగ సంస్థ టీఏఎస్‌ఎల్‌ నిలిచింది. సరఫరాతో పాటు విస్తరణ స్థానాల్లో వాహనాలు నిర్వహించడానికి టీఏఎస్‌ఎల్‌ 7 రోజులు 24 గంటలు సహాయ సహకారాలు అందిస్తుంది. ఐపీఎంవీ అనేది డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ)తో సహా అభివృద్ధి ప్రాజెక్టు.

కరోనా సవాళ్లు ఎదుర్కొని తయారీ
ఈ సందర్భంగా టీఏఎస్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సుకరన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఐపీఎంవీల విజయవంతమైన డెలివరీ.. టీఏఎస్‌ఎల్‌, భారత రక్షణ తయారీ రంగానికి ఓ ప్రధాన మైలురాయిగా అభివర్ణించారు. ఇది వ్యూహాత్మక ప్లాట్‌ఫామ్‌ మొదటి వాణిజ్య విక్రయాన్ని సూచిస్తుందని తెలిపారు. డీఆర్‌డీఓ, ఓ ప్రైవేట్‌ ప్లేయర్‌తో కలిసి అభివృద్ధి చేశారని, మహమ్మారి కారణంగా ఎదురయ్యే సవాళ్లు, ఇబ్బందులను తట్టుకుని టీఏఎస్‌ఎల్‌ ఈ ఘనత సాధించిందని వివరించారు. ఇది ఈ విజయాన్ని తమకు మరింత గొప్పగా చేస్తుందన్నారు. ఐపీఎంవీలు.. టీఏఎస్‌ఎల్‌ పూణ కేంద్రంలో అభివృద్ధి చేసినట్టు వివరించారు. ఈ ఐపీఎంవీలు డీఆర్‌డీఓ యూనిట్‌ అయిన వెహికిల్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (వీఆర్‌డీఈ)తో పాటు టీఏఎస్‌ఎల్‌ స్వదేశీయంగా రూపొందించిన వీల్డ్‌ ఆర్మర్‌ ్డ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడ్డాయన్నారు. ఎడారులు, ఎత్తయిన ప్రదేశాల్లో భారత సైన్యానికి సహాయపడుతాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement